Header Banner

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం..! పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Sun May 25, 2025 11:07        Others

పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికీ అమెరికానే కారణమని పాక్ మంత్రి అన్నారు. ‘‘గత 100 ఏళ్లల్లో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించింది. వాళ్లు 260 యుద్ధాల్లో పాల్గొన్నారు. చైనా కేవలం మూడు యుద్ధాలను మాత్రమే చేసింది. ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతోంది. ధనం ఆర్జిస్తోంది. అక్కడి ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తిమంతమైనది. వేళ్లూనుకుపోయి ఉన్నది. అమెరికా జీడీపీలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతోంది. అందుకే వారు యుద్ధాలను రెచ్చగొడుతుంటారు’’ అని కామెంట్ చేశారు.

సిరియా, ఆఫ్ఘనిస్థాన్, లిబియా వంటి దేశాలు ఒకప్పుడు సుసంపన్నమైనవని, సుదీర్ఘ యుద్ధాల కారణంగా సర్వనాశనమైపోయాయని అన్నారు. దివాలా తీశాయని తెలిపారు. అమెరికా వల్లే ఈ దేశాలు పతనమయ్యాయని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

ప్రత్యర్థి దేశాలు రెండిటితోనూ అమెరికా ఆటలు ఆడుతుంటుందని పాక్ మంత్రి అన్నారు. అస్థిరత వివాదాలపైనే అమెరికా యుద్ధ పరిశ్రమ బతుకుతుంటుందని ఆగ్రహించారు.

ఈ కామెంట్స్‌ నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాక్ మిలిటరీ కూడా అమెరికా నిధులు, ఆయుధాలను తీసుకుంటూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘‘పాక్‌కు సాయం కావాల్సి వచ్చినప్పుడు అమెరికా ముందు సాగిలపడుతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాబట్టి మళ్లీ అమెరికాను తిట్టిపోస్తోంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

పొరుగు దేశంపై ద్వేషం చిమ్మడమే విదేశాంగ విధానంగా పెట్టుకున్న ఓ దేశ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రమే అని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం పాక్ మంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. అమెరికా నిజస్వరూపం ఇదేనని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanMinister #USWars #GlobalConflicts #ControversialRemarks #WorldPolitics #AmericaUnderFire